![]() |
![]() |
.webp)
ఈ వారం కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఎపిసోడ్ ప్రోమో సూపరో సూపర్ లా ఉంది. అమ్మాయిలైతే అచ్చమైన తెలుగింటి ఆడపిల్లల్లా అందంగా మెరిసిపోయారు. ఐతే ఇందులో బ్రహ్మముడి కావ్య చేసిన అల్లరి ఎప్పటిలాగే ముద్దుగా క్యూట్ గా ఉంది. అల్లరి క్యూట్ గా ఉంటే ఉంది కానీ శేఖర్ మాష్టర్ ని కూడా పటాయించేసింది ఈ వారం ఈ అల్లరి పిల్ల. బొమ్మరిల్లు మూవీలో జెనీలియా రోల్ కనిపించి అందరినీ మెస్మోరైజ్ చేసేసింది. జెనీలియా వేసుకున్న కాస్ట్యూమ్ వేసుకొచ్చి స్టేజి మీద గంతులేసింది. శ్రీముఖి అడిగింది "నీ పేరేమిటి" అనేసరికి "హహ హాసిని" అంటూ నవ్వుతూ చెప్పింది కావ్య. "సరే నీ సిద్దు ఎక్కడా" అని అడిగింది శ్రీముఖి.
.webp)
దాంతో కావ్య సిద్దు అంటూ వేలు పెట్టి శేఖర్ మాష్టర్ ని చూపించేసరికి "వద్దమ్మా వద్దు" అన్నాడు దణ్ణం పెడుతూ. "అంతేనా" అని జూనియర్ జెనీలియాలా గారంగా అడిగేసరికి "ఇంకేం కావాలి" అన్నాడు శేఖర్ మాష్టర్. "వీలయితే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ" అని అడిగింది. ఇక గోమతి ప్రియా ఐతే "ఎం మాయ చేసావే" మూవీలో సమంత రోల్ పోషించింది. ఆమె లాగే చీర కట్టుకుని బాగ్ తగిలించుకుని స్టేజి మీదకు వచ్చి "నా పేరు జెస్సి. నా ఏజ్ 24 .. మా డాడీ అడిగితే వీళ్లంతా నా బ్రదర్స్ అని చెప్తాను" అంటూ సినిమా డైలాగ్ చెప్పింది. దాంతో అటు ఇటు కానీ గెటప్ లో ఉన్న యాదమ్మ రాజు లేచి "మరి నేను" అని అడిగాడు "సిస్టర్ " అని చెప్తా అంది గోమతి ప్రియా. ఇక లాస్ట్ లో పల్లవికి, అంబటి అర్జున్ కి మధ్య బిగ్ ఫైట్ అయ్యింది.
![]() |
![]() |